మహేష్ 25 వ సినిమా టైటిల్

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 01:30 PM

మహేష్ 25 వ సినిమా టైటిల్

బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ రెండు డిజాస్టర్స్ తో చాలా ఇబ్బందులు పడిన మహేష్ బాబుని కొరటాల శివ.. భరత్ అనే నేను తో ఒడ్డున పడేసాడు. భరత్ అనే నేను బంపర్ హిట్ అవడమే కాదు మహేష్ బాబు రేంజ్ ని మరింత పెంచింది.మహేశ్ బాబు తన 25వ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ విలేజ్ సెట్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ చెప్పలేదు. దాంతో ఈ విషయంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతూ వెళుతోంది.. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇక వంశి పైడిపల్లి – మహేష్ సినిమాకు రాజసం అనే టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మహేశ్ బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. మహేశ్ అభిమానులకు ఇది ఆయన బర్త్ డే గిఫ్ట్ అన్నమాట. ఈ సినిమాలో మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతు సమస్యలపై పోరాడే యువకుడిగాను కనిపించనున్నాడని అంటున్నారు. ప్రేమ .. స్నేహం .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. రివేంజ్ ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Untitled Document
Advertisements