ఓ బేబీ ట్రైలర్ : మంచం ఎక్కితే రెచ్చిపోయే మగాడు కావాలి

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 10:55 AM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత చెప్పినట్టుగానే సరికొత్త చిత్రాలతో మనముందుకి వస్తుంది . ఓ బేబీ సినిమాతో సమంత మరో భారీ హిట్ కొట్టేలా కనిపిస్తోంది. 70 ఏళ్ల బామ్మ వయసు నుంచి 24 ఏళ్ల పడుచు పిల్లలా కనిపించే స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ట్రైలర్ లోకి వెళితే .. తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు, ఆ మెరుపు వెలుగులో బేబీ 70 ఏళ్ల ముసల్ది ఇప్పుడు 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్‌ రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.'దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది' అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ ట్రైలర్ లో అనేక ఎమోషన్స్ తో కట్ చేశారు. ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. యంగ్ బేబీగా ప్రముఖ నటి లక్ష్మి, పడచుగా మారాక సమంత కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. ఇక ఈ ట్రైలర్ లో ఎలాంటి మొగుడు కావాలని శౌర్య అడిగితే మంచం ఎక్కితే రెచ్చిపోయే మగాడు కావాలని బెబీ చెప్పడం హైలైట్.

నాగ శౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ - రావ్ రమేష్ కీలక పాత్రలో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements