కరోనా పై కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 04:54 PM

మొన్నటివరకు చాలా తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల పై నిత్యం సమీక్షి స్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. ఆస్పత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు పెంచాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని వివరించారు. కార్మికులు, కూలీలకు ఆహారం తాగునీరు అందిస్తున్నామని అన్నారు. అయితే సామాజిక దూరం పాటించేలా రైతుబజార్ ల సంఖ్యని పెంచుతున్నాం అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సంచార దుకాణాలు ద్వారా నిత్యావసరాలను ఇళ్ళ వద్దకు చెరుస్తున్నాం అని వ్యాఖ్యానించారు.అయితే ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నాము అని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కరోజే ఏపీ లో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు వీటి సంఖ్య 87 కి చేరింది.





Untitled Document
Advertisements