వన్డేల్లో సూపర్ ఓవర్ వద్దు: రాస్ టేలర్

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 11:10 AM

వన్డేల్లో సూపర్ ఓవర్ వద్దు: రాస్ టేలర్

వన్డేల్లో సూపర్ ఓవర్ అర్థరహితమని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ టై‌గా ముగియగా.. సూపర్ ఓవర్‌ నిర్వహించారు.. ఆ సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమవడంతో మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ని విజేతగా ప్రకటించారు. కానీ.. వన్డేల్లో మ్యాచ్‌ టై అయితే.. రెండు జట్లని ఉమ్మడి విజేతగా ప్రకటించడం మంచిదని టేలర్ సూచించాడు.
‘‘వన్డేల్లో మ్యాచ్ టై అయితే.. దాన్ని టైగానే పరిగణించాలి. అంతేతప్ప.. సూపర్ ఓవర్ నిర్వహించకూడదు. అయినా.. 50 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడం సమంజసమేనా..? టీ20ల్లో అయితే సూపర్ ఓవర్ ఓకే. కానీ.. వన్డేల్లో మాత్రం ఆ అవసరం లేదు. ఒకవేళ మ్యాచ్ టై అయితే.. రెండు జట్లనీ విజేతగా ప్రకటించాలి. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ జరుగుతుందని నేను ఊహించలేదు’’ అని రాస్‌ టేలర్ వెల్లడించాడు.

రికార్డులపరంగా చూసుకుంటే సూపర్ ఓవర్‌లు న్యూజిలాండ్‌కి అస్సలు కలిసిరావట్లేదు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో కివీస్ సూపర్ ఓవర్‌లో ఆడింది. కానీ.. అన్నింటిలోనూ ఓడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్‌‌లో న్యూజిలాండ్ పరాజయాన్ని చవిచూసింది.





Untitled Document
Advertisements