పాలు పంచదారలేని టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచివట...

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:27 PM

పాలు పంచదారలేని టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచివట...

చల్లటి గాలులు వీస్తూ, వాతావరణంలోని తేమ చలికి వణికిస్తున్న వేళ వెచ్చగా టీ, కాఫీ తగలని ఎవరికీ మాత్రం అనిపించదు. అంతేకాదు టీ, కాఫీలు కావల్సిన వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు, రోజంతా గడపడానికి అవసరమయిన ఎనర్జీని కూడా ఇస్తాయి. అయితే టీ, కాఫీలలో ఉండే పాలు పంచదార ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. కానీ పాలు పంచదారలేకుండా టీ, కాఫీలు తాగడం అలవాటు చేస్కుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ. రెండింటిలో రుచి విషయంలో ఏ పొటీ లేదు, రెండూ రుచిగానే ఉంటాయ్, పైగా దేని టేస్ట్ దానిది, ఇందులో పోల్చడానికి ఏమీ లేదు. అయితే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ హెల్దీ అన్న దాని మీదే మన ఫోకస్ అంతా.

బ్లాక్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. బ్లాక్ టీలో ఎలాంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు, బ్లాక్ టీ మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రెగ్యులర్ గా బ్లాక్ టీ తాగేవారు ఎక్కువ క్యాలరీలు కరిగిస్తారని ఒక స్టడీలో తెలిసింది. ఒక కప్పు బ్లాక్ టీ లో ఉండే క్యాలరీల సంఖ్య రెండు, అవును ఒక కప్పు బ్లాక్ టీ లో రెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

ఫిట్నెస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చే వారందరు కూడా బ్లాక్ కాఫీ ని ఇష్టపడతారు. వీరు జిమ్ లోకి అడుగుబెత్తబోయే ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే మెటబాలిజంకి తగిన బూస్ట్ ఇస్తుందని వీరి నమ్మకం. అలాగే వర్కౌట్ కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ని బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ అందిస్తుంది. బ్లాక్ కాఫీలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. బ్లాక్ కాఫీ తీసుకునే వారికి ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తక్కువని ఒక స్టడీలో తెలిసింది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో ఉండే క్యాలరీల సంఖ్య సున్నా. అవును, బ్లాక్ కాఫీలో క్యాలరీలు ఉండవు.

బ్లాక్ కాఫీ, బ్లాక్ టీలో కెఫీన్ కంటెంట్ తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ రెండూ మంచివే, రెండూ ఆరోగ్యకరమైనవే. మీకు అవసరమైన బెనిఫిట్స్ ని బట్టి ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి. పొద్దున్నే వర్కౌట్స్ చేసే మాటైతే మెటబాలిజంకి తగిన బూస్ట్ ఇచ్చి వర్కౌట్స్ కి అవసరమైన ఎనర్జీ ని ఇచ్చేది బ్లాక్ కాఫీ. కానీ, మీకు ఎక్కువ కెఫీన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే బ్లాక్ టీ తీసుకోండి. హైబీపీ, యాంగ్జైటీ ఉన్న వారు బ్లాక్ కాఫీ కి దూరంగా ఉండడం మేలు. ఎవరైనా సరే సాయంత్రం తరువాత బ్లాక్ కాఫీ తాగకుండా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు, లేట్ గా బ్లాక్ కాఫీ తాగితే అది సరిగ్గా నిద్ర పట్టనివ్వదు.





Untitled Document
Advertisements