ఫిబ్రవరి 1న బడ్జెట్ 2021? కానీ అవేమీ ఉండవు!!

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 05:40 PM

ఫిబ్రవరి 1న బడ్జెట్ 2021? కానీ అవేమీ ఉండవు!!

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ తీసుకువస్తోంది. అందుకే ఇది సాధారణ బడ్జెట్ కానే కాదు.
బడ్జెట్ 2020 ద్వారా ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సిన్ అందించానలి మోదీ సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా ఈసారి బడ్జెట్ పలు విధానాలకు స్వస్తి పలకనుంది. పాత సాంప్రదాయాలు, ఆచారాలకు మంగళం పలకబోతున్నారు. 1947 నవంబర్ 26 నుంచి చూస్తే.. తొలిసారిగా ఈసారి బడ్జెట్ పత్రాలను ప్రింట్ చేయడం లేదు.

ప్రతి బడ్జెట్‌కు సాధారణంగా నార్త్ బ్లాక్ హౌస్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తారు. అయితే ఈసారి మాత్రం ఇలా ఉండదు. కరోనా వైరస్ దెబ్బకి బడ్జెట్ పత్రాల ముద్రణ ఉండదు. అంతేకాకుండా హల్వా కార్యక్రమం కూడా ఉండదని గుర్తించాలి. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం అయ్యే రోజు హల్యా కార్యక్రమం చేస్తారు. బడ్జెట్ పత్రాలను ముద్రించడం లేదు. అందుకే హల్వా కార్యక్రమం కూడా ఉండదు.





Untitled Document
Advertisements