'ఎక్స్' వేదిక‌గా ప్రభాస్ సినిమా పై స్పందించిన విజ‌య్ దేవ‌రకొండ

     Written by : smtv Desk | Sat, Jun 29, 2024, 06:29 PM

 'ఎక్స్' వేదిక‌గా ప్రభాస్ సినిమా పై స్పందించిన విజ‌య్ దేవ‌రకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమా చూసి 'ఎక్స్' వేదిక‌గా స్పందించారు. రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వ‌చ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్‌ను జోడించి రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో క‌ల్కి క‌లెక్ష‌న్ల‌లో దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 298.5 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్ప‌టికే మూవీని వీక్షించిన ప‌లువురు ప్ర‌ముఖులు భార‌త సినిమాను మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

తాజాగా టాలీవుడ్ యువ హీరో విజ‌య్ దేవ‌రకొండ కూడా సినిమాను చూసి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించాడు. ఈ మూవీతో ఇండియ‌న్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయింద‌ని విజ‌య్ అన్నాడు. ఇంతకుముందే సినిమా చూశాన‌ని, ఏం చెప్పాలో కూడా అర్థం కావ‌ట్లేద‌న్నాడు. ఈ సినిమా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చాడు. కాగా, క‌ల్కిలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే.
https://twitter.com/TheDeverakonda/status/1806994984932921744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1806994984932921744%7Ctwgr%5Ef376c8ad39476e915a2091772ca414074732e93d%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F805099%2Fvijay-deverakonda-tweet-on-kalki-2898-ad-movie






Untitled Document
Advertisements