వైజాగ్ లో "రంగస్థలం" ప్రీ-రిలీజ్..!

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 06:11 PM

వైజాగ్ లో

హైదరాబాద్, మార్చి 10 : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం” విడుదల తేది ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా రిలీజ్ కి 20 రోజులు ఉండటంతో ఈ ప్లేస్ ను రిప్లేస్ చేసేందుకు ఈ చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.

వైజాగ్.. ఆర్కే బీచ్ లో ఈ నెల 18వ తేదీన రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి భారీస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఈ వేదికపై దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుండటం ప్రధాన ఆకర్షణగానిలువనుంది. ఈ సినిమా 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో రూపొందడంతో ఇదే వేదికపై బుర్రకథను.. తప్పెటలను.. చోడవరం డప్పు వాద్యాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements