ఆరేళ్ల చిన్నారి పై లైంగిక దాడి..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 11:07 AM

 ఆరేళ్ల చిన్నారి పై   లైంగిక దాడి..

భీమారం, ఏప్రిల్ 16: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆరేళ్ల బాలిక పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానిక అమరావతినగర్‌ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దనాన్న కుమారులే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతా మని బెదిరించారు. అమరావతినగర్‌కు చెంది న ఓ దంపతుల కూతురు(6) అదే ప్రాంతం లోని పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆ సమీపంలోనే బాలిక పెద్దనాన్న కుటుంబం నివాసముంటోంది.

ఈ క్రమంలో వరుసకు సోదరులైన ఇద్దరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారం కిందట బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో జరిగిన విషయ౦ కూతురు తెలిపినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. తల్లి పిర్యాదు మేరకు పోలీసులు బాలికను వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్భయ చట్టంకింద కేసు నమోదు చేసినట్లు హన్మకొండ ఏసీపీ రాజేంద్రపసాద్‌ తెలిపారు.


Untitled Document
Advertisements