రోడ్లపై చెత్త వేసిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే భారీ పైన్..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 04:56 PM

రోడ్లపై చెత్త వేసిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే భారీ పైన్..

ఒక పక్క పారిశుద్ధ్య కార్మికులు దుమ్ము ధూళి లెక్కచేయకుండా తమ విధులు నిర్వహిస్తూ రోడ్డుపై, చెత్త లేకుండా శుభ్రం చేస్తూ ఉంటే మరోపక్క కొంతమంది ప్రజలు మూర్ఖంగా చెత్త బండి కి డబ్బులు చెల్లించకుండా ఉండాలని ఉద్దేశంతో తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో నుంచి చెత్త తెచ్చి రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు, దీంతో చెత్త పై ఈగలు పేరుకుపోయి, కుక్కలు మరియు పందులు రోడ్లపై ఉన్న చెత్తను చిందరవందర చేస్తూ రోడ్లు మరియు కాలనీలను చెత్తమయంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఒకపక్క ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన కొంత మంది ప్రజలు దానికి విరుద్ధంగా సమాజానికి కీడు చేసే విధంగా మారుతున్నారు కాగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని ఇప్పటికే మన దేశంమంతాట పాటించారు. ఈ క్రమంలో తమ చుట్టు పక్కల ఉన్న చెత్తా, చెదారాన్ని తొలగించుకుని పరిశుభ్రంగా ఉంచుకొవడం దీని ప్రధాన ఉద్దేష్యం. అయితే.. ఇప్పటికి దేశంలోని పలు నగరాలలో చెత్తను ఇష్టమోచ్చినట్లు పారేస్తున్నారు. అదే విధంగా.. ఇళ్లు, దుకాణాలు, ఫ్యాక్టరీలలోని వ్యర్థాలు ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీంతో అక్కడ ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటారు.
కావున కొన్ని చోట్ల రోడ్లపైన కూడా పేపర్ లు, వ్యర్థాలతో కుప్పలుగా పేరుకుపోతుంటుంది. అయితే.. అధికారులు ఎంతగా శుభ్రం చేసిన కొంత మంది కావాలని వ్యర్థాలను రోడ్లపైన వేస్తుంటారు. దీంతో ఇలాంటి వారిని కట్టడి చేయడానికి అధికారులు తమ వంతుగా జరిమానాలు విధించడం చేస్తుంటారు. అయితే.. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
వివరాలలో వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లో మున్సిపల్ అధికారులు చెత్తను ఇష్టమోచ్చినట్లు రోడ్లపై వేసేవారిపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి బనారస్ మున్సిపల్ పరిధిలో రోడ్లపై చెత్తను వేయకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రతిరోజు ఉదయాన్నే మున్సిపల్ నుంచి చెత్తను తీసుకెళ్లడానికి ప్రతివీధిలో ప్రత్యేకంగా వాహనం వస్తుంది. అప్పుడు ఇంట్లోని వ్యర్థాలను,యజమానులు ఆ వెహికిల్ లో వేయాలి. ఆ తర్వాత.. ఎక్కడ కూడా చెత్తను వేయకూడదంటూ అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ఎవరైన ఉదయం 8 తర్వాత లేదా చెత్తను రోడ్ల మీద వేసినట్లు పట్టుపడితే వారికి 500 ల నుంచి రూ. లక్ష వరకు కూడా జరిమాన విధిస్తామంటూ అధికారులు అక్కడి వారిని హెచ్చరించారు. అంతే కాకుండా.. దీన్ని చూడటానికి ప్రత్యేకంగా కొందరిని నియమించినట్లు కూడా తెలిపారు. కాగా, ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా వారణాసి 21వ స్థానంలో నిలిచింది. అయితే.. 2021లో బనారస్ ర్యాంకింగ్ 30వ స్థానంలో ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్‌ను మెరుగుపరచడంతో పాటు బనారస్ నగరాన్ని మునుపటి కంటే క్లీన్ సిటీ గా మార్చడానికి ఈ కఠినమైన చర్యలను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Untitled Document
Advertisements