ఈ ఇంటి చిట్కాతో కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు మాయం..

     Written by : smtv Desk | Tue, May 07, 2024, 02:55 PM

ఈ ఇంటి చిట్కాతో కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు మాయం..

అందమైన మోము కలిగి ఉండడం ప్రత్యేకం అయితే ఆకర్షించే కళ్ళు కలిగి ఉండడం కూడా అంతే ప్రత్యేకం.
మనం చెప్పలేని ఎన్నో విషయాలను మన కళ్ళే చెబుతాయి అంటారు. కళ్ళకి అంత పవర్ ఉంది మరి. అలాంటి అందమైన కళ్ళ చుట్టూ వలయాలు ఉంటే.. ఆ వలయాలు కూడా చాలానే చెబుతాయి. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, నిద్రలేకపోయినా ఈ సమస్య వస్తుంది. దీంతో కళ్ళు అనుకున్నంత అందంగా కనిపించవు. మరి ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

బంగాళదుంప ఒకటి
కాఫీ పౌడర్ 1 సాచెట్
1 విటమిన్ ఈ క్యాప్సూల్

ఏం చేయాలి.. ముందుగా బంగాళాదుంపల్ని తీసుకుని తురుముకోవాలి. ఓ గిన్నెలో రసాన్ని తీసుకోవాలి. అందులోని కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి. దీనిని రెండు కళ్ళపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో కడగాలి.

బెనిఫిట్స్.. బంగాళాదుంప రసంలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. దీనిని రాయడం వల్ల మచ్చలు, నల్లటి వలయాలు తగ్గుతాయి. దీంతో చర్మం కూడా మెరుస్తుంది.

కాఫీ పౌడర్.. కాఫీ పౌడర్‌లో కూడా కెఫిన్ ఉంటుంది. ఇది రక్తప్రసరణని కళ్ళ కింద వాపుని తగ్గిస్తుంది. కళ్ళు అందంగా కనిపించేలా చేస్తుంది.

విటమిన్ ఇ ఆయిల్.. యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్న ఈ క్యాప్సూల్స్ చర్మాన్ని కాపాడతాయి. ముడతల్ని తగ్గిస్తాయి. ఇందుకోసం దీనిని వారానికి 2 నుంచి 3 సార్లు వాడొచ్చు. ఈ క్యాప్సూల్‌లోని నూనెని అప్లై చేయడం వల్ల చర్మం ఎలాస్టిక్‌గా మారుతుంది.

అయితే, కేవలం ఇంటి చిట్కాలతోనే సమస్య మొత్తాన్ని దూరం చేయలేం. దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఏవైనా అలర్జీలు ఉంటే.. ముందు డాక్టర్‌ని కలిసి మాట్లాడండి. మంచి డైట్, మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. చక్కటి నిద్ర అన్ని రకాల ఆరోగ్యాలకి సరైన పరిష్కారం. మనకు వచ్చే అనారోగ్య సమస్యలు నూటికి యాభై శాతం నిద్రలేమి కారణంగానే వస్తాయి అని గుర్తుంచుకోవడం తప్పనిసరి.





Untitled Document
Advertisements