జనసేనాని పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా హీరో నాని ట్వీట్ ..

     Written by : smtv Desk | Tue, May 07, 2024, 12:25 PM

జనసేనాని పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా హీరో నాని ట్వీట్ ..

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్. చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో గా ఎదిగారు. హీరో నానికి ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది. ఇతర హీరోలతో తనకు దగ్గరతనం, అభిమానంతో జనసేనాని పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ‘ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కల్యాణ్ కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.
https://twitter.com/NameisNani/status/1787719786610434473?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1787719786610434473%7Ctwgr%5E656e96f540ef1428b1e5cb217c858f555137cdf5%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F800913%2Fnatural-star-nani-tweet-in-support-for-pawan-kalyan






Untitled Document
Advertisements