మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్పలో నుండి ప్రీ లుక్ పోస్టర్

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 03:32 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్పలో నుండి ప్రీ లుక్ పోస్టర్

టాలీవుడ్ లో అనేక సినిమాలు దేవుళ్ల చరిత్రతో వచ్చాయి . అలా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ ఇట్ అయ్యాయి. ప్రత్యేకంగా శివుడికి సంబంధిచిన సినిమాలు చాలానే వచ్చాయి . వాటిలో చాలా మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. అయితే శివుడి పాత్రతో ఇప్పుడు మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్పలో కూడా శివ భక్తుడి జీవిత చరిత్రగా తెరకెక్కుతోంది. అందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్ లో శివుడి కాన్సెప్ట్ తో మరో సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన అభిషేక్ పిక్చర్స్.. కొత్త మూవీ అనౌన్స్ చేసింది. ఎలాంటి వివరాలు వెల్లడించకుండా నేరుగా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీన సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్లు అభిషేక్ పిక్చర్స్ వెల్లడించింది.
సినిమాటిక్ అనుభవాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. థండర్ స్టూడియోస్ తో కలిసి మా ప్రొడక్షన్ నెం.9ను ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ఏప్రిల్ 9న టైటిల్ ప్రకటన కోసం చూస్తూనే ఉండండి" అంటూ సోషల్ మీడియాలో అభిషేక్ పిక్చర్స్ సోమవారం షేర్ చేసింది. దీంతోపాటు ఎలక్ట్రిఫియింగ్ పోస్టర్ ను షేర్ చేసింది. పోస్టర్ లో భీకరమైన అవతారంలో ఉన్న శివుడు కొత్త విశ్వంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తున్నారు. నేలపై అంతా పుర్రెలు ఉన్నట్లుగా చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. అక్కడికి కాస్త దూరంలో మంచు పర్వతం ఉంది. శివుని ముఖాన్ని చూపించలేదు మేకర్స్. కానీ చాలా కోపంగా ఉన్నట్లు మాత్రం కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో ఆడియన్స్ ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు నిర్మాత అభిషేక్ నామా.

ఎలా అయితే ఏమి మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రీ లుక్ పోస్టర్ తో ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయని చెబుతున్నారు. అభిషేక్ నామా.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా మరో 8 రోజులు ఆగితే కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు. మరి మహా శివుడి అవతారం లో ఏ హీరో కనిపిస్తాడో అనే చర్చ నెట్టి జనులలో మొదలైంది.





Untitled Document
Advertisements