పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు నా వంతు కృషి చేస్తానంటూ వీడియో.. తండ్రి ముద్రగడకు షాకిచ్చిన క్రాంతి

     Written by : smtv Desk | Fri, May 03, 2024, 11:54 AM

పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు నా వంతు కృషి చేస్తానంటూ వీడియో.. తండ్రి ముద్రగడకు షాకిచ్చిన క్రాంతి

ఏపీ ఎన్నికల ముంగిట పలు పార్టీలకు చెందిన నేతలు కొంతమంది సొంత పార్టీలను వీడి ప్రత్యర్థి పార్టీలలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ... ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు. వైసీపీలోని ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు.

"అందరికీ నమస్కారం. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో వపన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి.. పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు.
వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు. కానీ పవన్ కల్యాణ్ గారని, ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కేవలం పవన్ కల్యాణ్ గారిని తిట్టడానికే మా నాన్నగారిని జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్ కల్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా" అని ఆమె వీడియో ద్వారా క్రాంతి వెల్లడించారు.
https://twitter.com/JanaSenaParty/status/1786240173417848837?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1786240173417848837%7Ctwgr%5Eac89f60a9df58c9abf6a6cac09b0ed3be0b3c593%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F800589%2Fmudragada-padmanabham-daughter-releases-video





Untitled Document
Advertisements