మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా వార‌సుడు వరుణ్ తేజ్

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 04:03 PM

మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మెగా వార‌సుడు  వరుణ్ తేజ్

మెగాస్టార్ ఫ్యామిలీ కి చెందిన వ‌రుణ్ తేజ్ మొదట్లో కొంచం తక్కువ సినిమాలు చేసిన ప్రస్తుతం అతనికి అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కొత్త అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన సినిమా 'ఆప‌రేష్ వాలంటైన్' కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై వ‌రుణ్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు గానీ అనుకున్న సక్సెస్ రాలేదు . ప్ర‌స్తుతం 'మ‌ట్కా' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త‌సినిమాకి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇది మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కి లాక్ అయ్యాడు.

ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ప్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్-యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయ‌ని స‌మాచారం. మ‌ట్కా సినిమా పూర్తిక‌గానే వ‌రుణ్ ఈ సినిమానే ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇక మేర్ల‌పాక ఏడాదిగా ఖాళీగానే ఉంటున్నాడు. ఆయ‌న చివ‌రిగా 2022 లో లైక్ షేర్ సబ స్క్రైబ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితం సాధించ‌లేదు. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` తో మేర్ల‌పాక ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి అందరికి తెలిసిందే.


ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అ త‌ర్వాత ఎక్స్ ప్రెస్ రాజా అంటూ మ‌రో సినిమా చేసాడు. అది బాగానే ఆడింది. ఇక `కృష్ణార్జున యుద్దం` నుంచి కష్టాలు మొద‌ల‌య్యాయి. నానితో తీసిన కృష్ణార్జున యుద్దం ప్లాప్ అయింది. ఆ త‌ర్వాత `ఏక్ మినీ క‌థ`..`మ్యాస్ట్రో` తెర‌కెక్కించాడు.ఈ రెండు సినిమాలు నిరాశ‌నే మిగిల్చాయి. ఆ త‌ర్వాత తీసిన సినిమా కూడా ఆశించిన ఫ‌లితం అందించ‌లేదు. దీంతో గ్యాప్ త‌ప్ప‌లేదు. ఏడాది గ్యాప్ అనంత‌రం వ‌రుణ్ తేజ్ ని మెప్పించాడు. ఈ సినిమా విజ‌యం గాంధీకి అత్యంత కీల‌కం అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమి లేదు . ర‌చ‌యిత‌గానూ గాంధీకి మంచి పేరుంది. మరి వ‌రుణ్ కోసం ఎలాంటి స్టోరీ రాసాడు? అన్న‌ది తెలియాలి. అలాగే వ‌రుణ్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న `మ‌ట్కా`పైనా చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇది పాన్ ఇండియాలో చేస్తోన్న చిత్రం. ఆయ‌న కెరీర్ లోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. ఏది ఏమైనా ఈ సినిమా ఇద్దరికి ఎలాంటి పేరు తెస్తున్దో చూడాలి . ఈ సినిమాకి హీరియిన్ గ ఎవరిని సెలెక్ట్ చేసారో తెలియలిసింది ఉంది .






Untitled Document
Advertisements