విజయ్ దేవరకొండకి లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన పాఠం ఇదే

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 01:17 PM

విజయ్ దేవరకొండకి లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన పాఠం ఇదే

అందరిని అలరిస్తూ తాను చేసే ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఆయనకు ఎలాంటి స్క్రీన్ నేమ్ లు అవసరం లేదు . నేను ఎలాంటి సినిమాలు అయినా చేస్తాను అనే ధీమా తో ఉంటాడు . కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి తో అదరగొట్టేసిన విజయ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కోసం మళ్ళి ఎదురుస్తున్నాడు .

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ తో ముందుకు రాబోతున్నాడు. సమ్మర్ లో ప్రేక్షకులను అలరించడానికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు విజయ్. ఫ్యామిలీని నడిపించేందుకు ముందు ఉన్నవాడే ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో తన పాత్ర కూడా అదే అంటూ సినిమా కథ చూచాయగా చెప్పాడు విజయ్. అంతేకాదు ఈ సినిమా కథ వినగానే తన తండ్రి గుర్తొచ్చాడని అందుకే సినిమా లో హీరో పేరు గోవర్ధన్ అని పెట్టమని డైరెక్టర్ బుజ్జిని అడిగానని ఆయన ఒప్పుకున్నారని అన్నారు.

కెరీర్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో క్క లైఫ్ స్టైల్ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు ఊహించని షాక్ లు ఇవ్వడం వల్ల కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తనని ఫ్లాపులు ఏవి చేయలేవని అంటున్నాడు. పూరీతో చేసిన లైగర్ సినిమా ఫ్లాప్ తన మీద ఏమంత ఎఫెక్ట్ చూపించలేదని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. కాకపోతే లైగర్ సినిమా వల్ల ఒకటి నేర్చుకున్నానని సినిమా రిలీజ్ కు ముందు దాని రిజల్ట్ గురించి మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యానని అన్నారు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో తనకు తానుగా వేసుకున్న శిక్ష అని అన్నారు
పూరీ డైరెక్షన్ లో లైగర్ అంటూ వచ్చిన విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని రిలీజ్ ముందు ఊగిపోయాడు. తీరా ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అయ్యింది. అందుకే ఆ సినిమా నుంచి ఇక మీదట రిలీజ్ కు ముందు సినిమా రిజల్ట్ గురించి మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యానని అన్నారు విజయ్. జీవితంలో ఏదురయ్యే సమస్యల నుంచి ఫెయిల్యూర్స్ నుంచి మనకు మనమే కొన్ని లెసన్స్ నేర్చుకుంటామని అందరు అంటున్నాట్టుగా విజయ్ కూడా లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన పాఠంతో కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని అంటున్నాడు . దేనిని బట్టి ఎవరికైనా ఫెయిల్యూర్ అయితేనే సక్సెస్ విలువ తెలుస్తుంది .






Untitled Document
Advertisements