అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 10:33 AM

అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

పూర్వం నుంచే మానవులు అనేక రకాలైన పశుపక్షాదులను, జంతు జీవులను, జలాచరాలను పూజించడం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికి
మన గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కోళ్లు , గేదెలు, ఆవులు , గొర్రెలు మొదలైన వాటినే పెంచుకుంటూనే ఉంటారు . ఈ మధ్య కాలంలో ఈ ఆచారంలో అనేక మంది పట్టణాలలో కూడా రంగురంగుల చేపలను గాజు తొట్టలో ఉంచి ఇంట్లో పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. దీన్నే అక్వేరియం అంటారు. ఈ జలచరాలకు పూజల్లో ప్రత్యేక స్థానం ఉంది. సాక్షాత్తు జలాచారాలను శ్రీమన్నారాయణుడి అవతారమైన మత్స్యవతారంతో పోలుస్తుంటారు.ఈ జలాచరాలను పూజించడమే కాకుండా పెంచుకునేందుకు సైతం ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇంట్లో వాస్తు సమస్య పరిష్కారాలకు, ఇంటి యజమానికి ధనాభివృద్ధి కలగడానికి ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలని నమ్మే వాళ్ళు సైతం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు కలిగే ఉపయోగం ఏమిటి? వాస్తు సమస్య పరిష్కారానికి ఎక్వేరియం పెట్టుకోవాలని దాంట్లో నిజమెంతుంది.? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.



వాస్తవానికి హిందూ ధర్మ శాస్త్రంలో అక్వేరియం పెట్టుకునే విషయమై ఎటువంటి ప్రస్తావన లేనప్పటికీ, ఎక్కడైతే నీటి సమృద్ధి ఉంటుందో అక్కడ ధన సమృద్ధి, ఫల సమృద్ధి లభిస్తుందని శాస్త్రాలు చెప్పుతున్నట్లు తెలుస్తుంది . ముఖ్యంగా పంచభూతాలు సైతం నీటి నుంచే ఉద్భవించాయని, హిందూ ధర్మ శాస్త్రంలో నీటికి అత్యంత ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది . ఇంట్లో సైతం నీరు సమృద్ధిగా ఉంటే ఇంట్లో ధన సమృద్ధి కలుగుతుందని నమ్మకం . అందుకని పలువురు ఇంట్లో నీటిని నిల్వచేసేందుకు అక్వేరియంలో వాడుతుంటారని, అందులో విష్ణుమూర్తి స్వరూపమైన మత్స్యావతారానికి ప్రతికగా ఉన్న చేపలను పెంచుతుంటారని తెలుస్తుంది . అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు, ఇంట్లో పలు రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగానే అక్వేరియాన్ని సైతం ఏర్పాటు చేసుకుంటారని మరి కొందరు అంటున్నారు.ఏది ఏమైన చేపలను పెంచుకోవడం వలన మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది . అంతేకాకుండా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వీటిని చూసి ఎంతో ఇష్ట పడతారు . వీటిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో కాపాడుకోవడం కదా అంత ముఖ్యం .






Untitled Document
Advertisements