ఎన్టీఆర్ దేవరపై విశ్వక్ సేన్ ,టిల్లు కామెంట్స్..

     Written by : smtv Desk | Wed, Apr 03, 2024, 02:47 PM

ఎన్టీఆర్  దేవరపై విశ్వక్ సేన్ ,టిల్లు కామెంట్స్..

కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా దేవరను రెండు భాగాలుగా విభజించారు. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా దానిని వాయిదా వేసి దసరా కానుకగా అక్టోబర్ 10కి విడుదల చేస్తున్నారు . దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే షూటింగ్ ఆలస్యమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎందుకంటే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని కొరటాల శివ చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు.
ఎన్టీఆర్‌ను హగ్ చేసుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ "ఎప్పటికీ లవ్ యూ ఎన్టీఆర్ అన్నా. దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్ట్ లెవల్. ఇక ఈ ఆల్బమ్ అందరినీ పాటలతో చంపేస్తుంది." అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ మొత్తాన్ని తన మ్యూజిక్, బీజీలతో ఓ ఊపు ఊపేస్తున్నాడు అనిరుధ్. దీంతో దేవర సినిమాపై కూడా అలాంటి అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక అనిరుధ్ కూడా ఈ సినిమా బీజీ వేరే లెవల్‌లో ఉంటుందని గతంలో కూడా చెప్పాడు.

ఇది ఇలా ఉండగా ఈ పోస్ట్ పెట్టిన కొద్హిసేపటికే సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ "త్వరలో బిగ్‌ సర్‌ప్రైజ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కొంపతీసి దేవరలో ఈ టిల్లు కూడా ఉన్నాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే విశ్వక్ సేన్, సిద్ధూ, నిర్మాత నాగవంశీ కలిసి ఎన్టీఆర్‌ను కలసినట్లు తెలుస్తోంది. గత రాత్రి ఎన్టీఆర్ వీరందరికీ పార్టీ ఇచ్చారట. ఆ ఫొటోలనే సిద్ధూ, విశ్వక్ సేన్ షేర్ చేశారు. ఎందుకంటే దేవర సినిమాలో విశ్వక్ సేన్ నటించాల్సి ఉందని, ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. వీటిపై విశ్వక్ కూడా ఇండైరెక్ట్‌గా స్పందించాడు. "నాకా బాగా ఇష్టమైన ఓ హీరో సినిమాలో అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నా. ఆ సినిమా స్టోరీ అదిరిపోతుంది. కానీ నా కోసం రాసిన పాత్ర అంతలా అనిపించలేదు. ఆ హీరోతో చేయాలంటే ఇంకా మంచి పవర్‌ఫుల్ రోల్‌లోనే చేయాలని వద్దనుకున్నా" అంటూ విశ్వక్ చెప్పాడు. దీంతో విశ్వక్ చెప్పింది ఎవరి గురించి అనుకుంటున్నారా , ఎన్టీఆర్ దేవర సినిమా గురించే . ఎన్టీఆర్ తో నటించాలి అంటే చాల గొప్ప అవకాశం అంటున్నాడు . మొత్తానికి దేవర సినిమా ఎన్టీఆర్ కు మంచి సక్సెస్ తెచ్చి పెడుతుంది అని ప్రేక్షకులు, మూవీ యూనిట్ దీమాతో ఉన్నారు.






Untitled Document
Advertisements