సూపర్ స్టార్ రజని కాంత్ కొత్త మూవీ టైటిల్ ?

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 03:13 PM

సూపర్ స్టార్ రజని కాంత్  కొత్త మూవీ టైటిల్ ?

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే గుర్తకు వచ్చే డైలాగ్ నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చేపినట్లే అన్న నరసింహ సినిమా డైలాగు, భాష, అరుణాచలం లాంటి ఎన్నో మంచి కథ ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయాడు . అయితే కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు . కానీ ఈ మధ్యనే తీసిన జైలర్ సినిమాతో తన స్థాయికి తగ్గ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన జైలర్ తర్వాత రజినీకాంత్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్‌ సినిమా ప్రకటన వచ్చింది.

ఖైదీ, విక్రమ్‌, లియో ఇలా విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో లోకేష్ దర్శకుడిగా స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు ఆయన నుంచి రజినీకాంత్‌ హీరోగా రాబోతున్న సినిమాకు 'కళుగు' అనే విభిన్నమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారు అనే వార్తలు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి

కళుగు అంటే గద్ద అని అర్థం. బంగారం స్మగ్లింగ్ కాన్సెప్ట్‌ మూవీకి ఈ టైటిల్‌ బాగా సెట్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. కళుగు టైటిల్ తోనే అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. కళుగు అంటే తెలుగు లో మరో అర్థం వస్తుంది. దాంతో తెలుగు ప్రేక్షకులు రజినీకాంత్‌ మూవీకి చిత్రమైన టైటిల్‌ అన్నట్లుగా కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మరోసారి లోకేష్ కనగరాజ్ తన యూనివర్స్‌ లోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లి సర్‌ప్రైజ్ చేయడం ఖాయం.

లియో తో నిరాశ పరిచిన లోకేష్ కనగరాజ్ కచ్చితంగా తలైవా సినిమాతో విక్రమ్‌ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో కనిపిస్తున్నాడు. రజినీకాంత్‌ ఇమేజ్ కి తగ్గట్లుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ ను రెడీ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో కూడా హీరో పాత్ర ను చాలా వైవిధ్యభరితంగా డిజైన్ చేస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా స్టార్ అవ్వలేదు . అంతేకాకుండా మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు . రజని కాంత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడు
రిలీజ్ అవుతుందో ఆయన డైలాగ్స్ ఎప్పుడు వినాలి అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది .







Untitled Document
Advertisements