స్వయంభులో మరో హీరోయిన్ గా నభా నటేష్ !

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 04:22 PM

స్వయంభులో మరో హీరోయిన్ గా నభా నటేష్ !

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ లో ప్రేక్షకుల్లో ఇస్మార్ట్ పోరిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నభా నటేష్. ఈ కన్నడ బ్యూటీ. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరకు నితిన్ మ్యాస్ట్రో లో కనిపించింది. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా సందడి చేయలేదు నభ.

కొన్ని నెలల క్రితం ఆమెకు యాక్సిడెంట్ కావడమే సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక ఇప్పుడు సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో మెల్లగా బిజీ అవుతోంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పీరియాడిక్ మూవీ స్వయంభులో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. స్వయంభు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నభను సెట్స్ లోకి ఆహ్వానం పలుకుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నభ ఎంతో అందంగా కనిపిస్తోంది. యువరాణిలా బంగారు ఆభరణాలతో మెరిసిపోతోంది. పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ తో నభ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. సినిమాలో ఆమె రోల్ కు మంచి స్కోప్ ఉన్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.చాల కాలం తర్వాత నిఖిల్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ కు బాణీలు కట్టిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాతో పాటు నభా నటేష్ హనుమాన్ తో సూపర్ సక్సెస్ అందుకున్న నిరంజన్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా కనిపించనున్నారు. ఇంతేకాకుండా మరో మూడు చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నాయట. మరి ఈ అమ్మడు రీ ఎంట్రీ తర్వాత వచ్చే సినిమాలతో ఎలాంటి హిట్ చేస్తుందో చూడాలి మరి .





Untitled Document
Advertisements