పెరటిలో లభించే అలోవెరాతో ఇలా చేస్తే పిగ్మంటేషన్, మచ్చల సమస్య దూరం

     Written by : smtv Desk | Fri, Apr 05, 2024, 09:47 AM

పెరటిలో లభించే  అలోవెరాతో ఇలా చేస్తే పిగ్మంటేషన్, మచ్చల సమస్య దూరం

మన ఇంట్లో పెంచుకునే మొక్కలలో అలోవెరా ఒకటి . దీనిని పెంచుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి . దీనిలో లభించే జెల్ ను ఉపయోగించుకొని జుట్టు ని పెంచుకోవచ్చును . అంతేకాకుండా ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, పిగ్మంటేషన్, మొటిమల్ని దూరం చేస్తాయి.
చాలా మందికి ముఖం, చర్మంపై నల్ల మచ్చలు ఉంటాయి. వీటి వల్ల వారి బ్యూటీని దెబ్బతీస్తాయి. చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం వల్లే ఈ బ్లాక్ హెడ్స్ వస్తాయి. అదే విధంగా, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ పేరుకుపోతాయి. దీనిని పోగొట్టేందుకు అలొవెరా స్క్రబ్ హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.


చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. ఈ సమస్యని దూరం చేసేందుకు ఖరీదైన క్రీమ్స్ వాడకుండా అలోవెరాని వాడొచ్చు. అలోవెరా జెల్‌లో నిమ్మరసంని కలపండి. నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. దీనిని నేరుగా ముఖానికి రాయొద్దు. జెల్‌లో మిక్స్ చేసి రాసి
30 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

చర్మ సమస్యల్లో ఇంకొకటి పిగ్మంటేషన్. దీని వల్ల చూడ్డానికి అందంగా కనిపించదు. దీనిని దూరం చేసేందుకు కూడా అలోవెరా బాగా పనిచేస్తుంది. అందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా తేనె కలిపి రాయండి. తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఇది చర్మాన్ని కాంతివంతంగా, రంగుని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్‌ని మీరు పిగ్మంటేషన్‌ ఎక్కువగా ఉండే కళ్ళ చుట్టూ ముఖానికి అప్లై చేయొచ్చు . ఇలా చేయడం వలన ముఖంపైన కనిపించే పిగ్మెంటేషన్ తగ్గుతుంది .

అందరికి అన్ని పడాలని లేదు. అందుకే, ఎవరైనా సరే అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అదే విధంగా, అలోవెరా జెల్ త్వరగానే ఆరిపోద్ది. అందుకే, ఎక్కువసేపు ఉంచకుండా త్వరగానే క్లీన్ చేసుకోవాలి. దీనిని వారానికి రెండు, మూడు సార్లు రాస్తే మంచిది. మార్నింగ్ చేయడం కంటె రాత్రుళ్ళు రాస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది.ఈ విధంగా మన పెరటిలో పెంచుకునే అలోవెరా తో మన ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు . అంతేకాకుండా మన జుట్టుకు కావలసిన పోషకాలను కూడా అందించవచ్చు .





Untitled Document
Advertisements