మామిడి పండును తినడానికి ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి?

     Written by : smtv Desk | Mon, Apr 29, 2024, 03:36 PM

మామిడి పండును తినడానికి ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి?

వేసవికాలంలో మండే ఎండలతో పాటు తీయ్యని మామిడి పండ్ల రుచులు కూడా పరిచయమే. పండ్లలో రాజాగా పిలవబడే మామిడిపండును ఇష్టపడని వారంటూ ఉండరు. మామిడి పండు పేరు చెబితే చాలు నోట్లో నీళ్ళు ఊరడం కాయం. రుచిగల ఈ పండు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఎలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు డైటరీ ఫైబర్, బీటా కెరోటిన్స్, పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఎన్నో విటమిన్స్ ఉంటాయి. అయితే ఏ పండుని తినడానికి కనీసం అరగంట ముందైన నీటిలో నానాబెట్టడం వలన ఇందులోని పోషక విలువలు మరింత పెరుగుతాయి అనడం మనం వింటూనే ఉంటాము. అది ఎందుకో తెలుసుకుందాము..


* మామిడిపండ్లు తింటే ఎన్నో సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియకి చాలా మంచిది. గ్యాస్, అసిడిటీ సమస్యలు దూరమవుతాయి. విటమిన్, ఇలు హార్మోన్ల బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బీపిని కంట్రోల్ చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, రెండూ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని నియాసిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* మామిడిపండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పండ్లలోని ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీనిని నీటిలో కాసేపు నానబెడితే ఫైటిక్ యాసిడ్‌ని దూరం చేయొచ్చు. ఇది మామిడిపండు బయటిపొరలో ఉంటుంది. దీనిని తింటే అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
​*మామిడిపండుని తినడానికి ముందు బాగా కడిగి నానబెట్టాలి. తర్వాత మరోసారి కడిగాలి. దీంతో దీనిపై ఏమైనా కెమికల్స్ చల్లితే అవన్నీ పోతాయి. ఈ కెమికల్స్‌ని అలానే తింటే క్యాన్సర్స్ వంటి సమస్యలకి దారితీస్తాయి.
*మామిడిపండ్లని నానబెడితే అవి చక్కగా మృదువుగా మారతాయి. దీని వల్ల ఇవి చక్కగా జీర్ణమవుతాయి. కాబట్టి, ఎప్పుడైనా సరే మామిడిపండ్లని తినే ముందు నానబెట్టడం మరువొద్దు.





Untitled Document
Advertisements