మాజీ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి: హరీశ్ రావు

     Written by : smtv Desk | Fri, May 03, 2024, 04:21 PM

మాజీ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ రాష్ట్రానికి  రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి: హరీశ్ రావు

సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి, మాజీ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలని అన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిందే సిద్దిపేట అన్నారు. తన నియోజకవర్గం సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రావడానికి కారణమే కేసీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి.. రుణమాఫీని అమలు చేయండి.. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాల్‌పై స్పందించారు.





Untitled Document
Advertisements