టీఆర్ఎస్వీ నేత మున్నూరు రవికి జైలు శిక్ష

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 12:42 PM

టీఆర్ఎస్వీ నేత మున్నూరు రవికి జైలు శిక్ష

మహబూబ్ నగర్, మే 4: టీఆర్ఎస్వీ (తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం) నేత మున్నూరు రవికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది. 2012 సెప్టెంబర్ 26న మహబూబ్ నగర్ లో జరిగిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై అప్పట్లో బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేశారు.

విచారణ దాదాపు ఆరేళ్లు సాగగా, జిల్లా జూనియర్ సివిల్ జడ్జి దీప్తి తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, తనకు రెండు రోజుల గడువు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం శనివారం వరకూ గడువిచ్చింది.

Untitled Document
Advertisements