ఆ ఎమోజీలను టచ్ చేయకండి..

     Written by : smtv Desk | Mon, May 07, 2018, 04:33 PM

ఆ ఎమోజీలను టచ్ చేయకండి..

హైదరాబాద్, మే 7 : ఈ బాల్ ను టచ్ చేస్తే మీ ఫోన్ హ్యంగ్ అవుతుందని, ఈ బ్లాక్‌ పాయింట్‌ను టచ్‌ చేస్తే మీ వాట్సప్‌ పని చేయదు. ఒకసారి టచ్ చేసి చూడండి. ఈ క్రింద ఉన్న లింక్ ను టచ్ చేస్తే ఒక సర్ ప్రైస్ న్యూస్ వింటారంటూ మీ ఫోన్ కి ఫార్వర్డెడ్ మెసేజెస్ వస్తున్నాయా.? చాలా ఫన్నీగా ఉందని టచ్ చేయకండి. ఎందుకంటే అలాంటి లింక్ లను గాని, బాల్స్ ను గాని టచ్ చేస్తే నిజంగానే మీ ఫోన్ హ్యాకింగ్ కి గురవుతు౦ద౦టూ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

గతంలో లింక్ లను టచ్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని వార్తలు వచ్చేవి. ఇలాంటి వార్తలపై నెటిజన్లకు అవగాహన రావడంతో కేటుగాళ్ళు తమ రూటు మార్చారు. విభిన్నమైన రీతిలో ఈ బ్లాక్‌ పాయింట్‌ను లేక ఎమోజీని టచ్‌ చేసి చూడండంటూ మెసేజ్‌లు పంపి మన స్మార్ట్‌ఫోన్లు హ్యాంగ్‌ అయ్యేలా చేస్తున్నారు. అలాగే, 'ఇది చాలా ఆసక్తికరంగా ఉంది' అంటూ ఓ మెసేజ్‌ పంపుతూ.. దాని పక్కనే నవ్వుతున్న ఎమోజీతో పాటు రీడ్‌ మోర్‌ అని ఉంటోంది. దాన్ని టచ్ చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. వాటిపై క్లిక్‌ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మెసేజ్‌లలో అదృశ్యంగా కొన్ని సింబల్స్‌ ఉంటాయని అంటున్నారు.

Untitled Document
Advertisements