రూబిక్ క్యూబ్ @ 4.22 సెకన్లు

     Written by : smtv Desk | Tue, May 08, 2018, 04:39 PM

రూబిక్ క్యూబ్ @ 4.22 సెకన్లు

మెల్‌బోర్న్, మే 8 :రూబిక్ క్యూబ్.. మనందరికీ బాగా తెలిసిందే. దీన్ని ఒకే విధంగా తెచ్చేందుకు ఎన్నో తంటాలు పడతారు. ఇంకొంతమంది అబ్బో ఇది మన వల్ల కాదురా అనుకుంటారు. కానీ 22 యువకుడు నాలుగు సెకన్లలోనే దానిని అమర్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్పీడ్ క్యూబర్ ఫెలిక్స్ (22) కేవలం 4.22 సెకన్లలో రూబిక్ క్యూబ్‌ని అమర్చి అంతకుముందు తన పేరిట ప్రపంచ రికార్డును తానే బద్దలుకొట్టాడు. అంతకుముందు 4.59 సెకన్లలో రూబిక్ క్యబ్‌ని సెట్ చేసిన ఫెలిక్స్.. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన కాంబోడియా కాంపిటేషన్‌లో 4,22 సెకన్లలోనే అమర్చాడు.






Untitled Document
Advertisements