ఇసుక లారీ ఢీకొని బాలుడి మృతి

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 11:27 AM

ఇసుక లారీ ఢీకొని బాలుడి మృతి

హైదరాబాద్, మే 9‌: ఇసుక లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. ఆటోనగర్ నుండి వేగంగా వస్తున్న లారీ సుష్మా థియేటర్ సెంటర్‌లో సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ నాగులు కుమారుడు చేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

నాగులుతో పాటు ఆయన కుమార్తె లావణ్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Untitled Document
Advertisements