సింగల్ సీట్.. విన్నింగ్ సీట్..!

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 01:48 PM

సింగల్ సీట్.. విన్నింగ్ సీట్..!

బెంగళూరు, మే 11 : భారతదేశంలో ఎన్నికలు అంటే చాలా మంది సెంటిమెంట్లను నమ్ముతారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైన క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకే నియోజకవర్గంపై పడింది. అదే శిరహట్టి శాసన సభ నియోజకవర్గం... ఎందుకంటే 46 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ సీఎం పీఠం అధిరోహిస్తుంది. 1972 నుంచి ఇదే అనావాయితీ కొనసాగుతుంది.

>> శిరహట్టి నియోజకవర్గం వాయవ్య కర్ణాటకలో ఉంది. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి వదిరాజాచార్య ఇక్కడి నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో కూడా దేవ్‌రాజ్‌ ఉర్స్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడింది.

>> 1983లో కాంగ్రెస్ నేత ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలిచి, జనతా పార్టీకి మద్దతు పలికారు. రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. 1985లో జనతా పార్టీ అభ్యర్థి ఈ స్థానం నుంచి గెలిచారు. రామకృష్ణ హెగ్డే రెండోసారి ముఖ్యమంత్రిగా జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

>> శిరహట్టి నుంచి 1989లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, ప్రభుత్వాన్ని కూడా ఆ పార్టీయే ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నేత వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మత ఘర్షణలు చెలరేగడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ఆయనను సీఎం పదవి నుంచి తొలగించారు.

>> 1994లో శిరహట్టి నుంచి జనతా దళ్ నేత మహంత షెట్టార్ గెలిచారు. ఆ పార్టీ చీఫ్ హెచ్ డీ దేవె గౌడ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

>> 1999లో ఈ స్థానంతోపాటు రాష్ట్రంలో అధికారాన్ని మళ్ళీ కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఎస్ ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.

>> 2004లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్‌కు దక్కలేదు. అయినప్పటికీ దేవె గౌడ నేతృత్వంలోని జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ కర్ణాటక అధికార పీఠాన్ని దక్కించుకుంది.

>> 2008లో శిరహట్టిలో పాగా వేసిన బీజేపీ కర్ణాటకలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

>> ఇక 2013లో సిరహట్టిలో కాంగ్రెస్‌ గెలుపొంది సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిరహట్టిలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 12న (శనివారం) పోలింగ్‌ జరుగుతుంది. మే 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వరు తమ ప్రతినిథిని ఎన్నుకోవడం మాత్రమే కాకుండా రాష్ట్ర పాలకులను కూడా నిర్ణయిస్తారా? సెంటిమెంట్‌ నిజమవుతుందా? లేదో వేచి చూడాలి.





Untitled Document
Advertisements