అల.. అంతా ఎత్తు ఎలా...!

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 01:19 PM

అల.. అంతా ఎత్తు ఎలా...!

వెల్లింగ్టన్‌, మే 12: సముద్రంలో అలలు తీరంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక్కోసారి ప్రచండ వేగంతో దూసుకువచ్చే అలలు కనీవినీ నష్టాన్ని మిగులుస్తాయి. అవి చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. తాజాగా నౌకపై విరుచుకుపడుతున్న ఎనిమిది అంతస్తుల ఎత్తైన రాకాసి అలను శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిమీ దూరంలో క్యాంప్‌బెల్‌ ద్వీపానికి సమీపాన సముద్రంలో దీన్ని రికార్డు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

78 అడుగులు పొడవైన (23.8 మీటర్లు) ఈ అల దక్షిణార్థగోళంలోనే అతిపెద్దది అని వారు తెలిపారు. 2012లో ఏర్పడిన అల 22.03 మీటర్లు ఎత్తైనదని సీనియర్‌ సముద్రశాస్త్రవేత్త టామ్‌ డ్యురాంట్‌ చెప్పారు. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద అల 1958లో అలాస్కాకు సమీపాన ఏర్పడింది. భూకంపం కారణంగా సునామీ తన ప్రతాపం చూపడంతో లితువా అఖాతంలో 30.5 మీటర్ల ఎత్తైన రాకాసి అల ఏర్పడింది.

Untitled Document
Advertisements