‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్ రిలీజ్..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 04:41 PM

‘హలో గురు ప్రేమకోసమే’ ఫస్ట్ లుక్ రిలీజ్..

హైదరాబాద్, మే 14 : యంగ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "హలో గురు ప్రేమకోసమే". త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. హీరో రామ్ పుట్టిన రోజు మే 15 సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో రామ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఫాలో అవుతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.Untitled Document
Advertisements