న్యూయార్క్ లో చై.. ప్రేమ పాటలు

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 03:32 PM

న్యూయార్క్ లో చై.. ప్రేమ పాటలు

న్యూయార్క్, మే 15 : హీరో నాగ చైతన్య కు న్యూయార్క్ నగరానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకో తెలుసా..! తను సమ౦త తో ప్రేమలో పడింది ఇక్కడే మరి. "ఏమాయ చేసావె" చిత్రీకరణ న్యూయార్క్ లోనే జరిగింది. ఈ సమయంలో చై.. సామ్ తో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ఆ ప్రేమ కాస్త పెళ్ళితో సుఖాంతమైంది.

తాజాగా చై.. తన ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకు౦టున్నారు. అదేనండీ.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సవ్యసాచి" చిత్రం కోసం న్యూయార్క్ వెళ్ళాడు. అక్కడ హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Untitled Document
Advertisements