"ఆఫీసర్" వాయిదా..!!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 11:53 AM


హైదరాబాద్, మే 16 : ప్రముఖ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. కింగ్ నాగార్జున కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం "ఆఫీసర్". దాదాపు 25 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. తొలుత ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలని అనుకున్నారు.. కాని అనివార్య కారణాల వల్ల సినిమాను జూన్‌ 1కి వాయిదా వేసినట్లు తాజాగా వర్మ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

అంతేకాకుండా.. "ఈ సినిమా సాంకేతికంగా బాగా రావాలని.. ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలని అనుకుంటున్నాం. దాంతో ముందుగా అనుకున్న దాని కంటే సాంకేతిక అంశాలకు మరింత సమయం పట్టేలా ఉంది. అందుకే ఈ సినిమాను జూన్‌ 1కి వాయిదా వేస్తున్నాం" అని ట్వీట్ చేశాడు. ఇటీవల విడుదల చేసిన "ఆఫీసర్" థియేట్రికల్‌ ట్రైలర్‌కు అభిమానుల నుండి మంచి స్పందన చేస్తుంది. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్ర౦ కోసం జూన్ వరకు ఆగాల్సిందే.

Untitled Document
Advertisements