కౌన్ బనే గా 'కన్నడ కింగ్'..!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 01:42 PM

కౌన్ బనే గా 'కన్నడ కింగ్'..!

బెంగళూరు, మే 16 : ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు ఆ రాష్ట్ర రాజ్ భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫలితాల మీద ఎంతా ఉత్కంఠ సాగిందో అంత కంటే ఎక్కువ ఆసక్తి ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో అని ప్రజలు చూస్తున్నారు. మరోవైపు క్షణక్షణం రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. కాగా ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికైన 78 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 66 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో మిగతా 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశానికి హాజరుకాలేదనే అంశంపై ఊహాగానాలు వెలువడుతున్నాయి.

నిన్న విడుదలైన కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 8 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యుహా, ప్రతివ్యూహాల మధ్య ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Untitled Document
Advertisements