"ఆపరేషన్ లోటస్" అంటే..!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:14 PM


బెంగుళూరు, మే 16 : కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ఫలితాలు వచ్చేంత వరకు ఒక ఎత్తుగా సాగిన సమీకరణలు ఇప్పుడు నెంబర్ గేమ్ గా మారాయి. ఓ వైపు 104 స్థానాల్లో గెలిచినా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటకు ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు కాంగ్రెస్-జేడీఎస్‌ కూడా అధికారం కోసం పావులు కదుపుతుంది. కాషాయిదళం ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తుంది. దీంతో ఎవ్వరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలియక ప్రజలు అయోమయంకు గురవుతున్నారు.

మెజార్టీకి సమీపంలో వచ్చి ఆగిపోయిన భాజపాకు రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ప్రభుత్వ ఏర్పాటుకు మొదట అవకాశం ఇవ్వాలి. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమకు మెజార్టీ ఉందని తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు తమ వైపునకు తిప్పుకునేందుకు ఆపరేషన్‌ కమల ద్వారా భాజపా యత్నిస్తోందని జేడీఎస్‌నేత కుమారస్వామి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను భారీగా నగదు, పదవులు ఆశ చూపి ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

"ఆపరేషన్‌ లోటస్" అంటే..

>> 2008 ఎన్నికల తర్వాత బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేపట్టింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని అలకరించారు. ఆ ఎన్నికల్లో భాజపా 110 స్థానాలను సాధించి మెజార్టీకి దగ్గరలో నిలిచిపోయింది. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన యడ్యూరప్ప ‘ఆపరేషన్‌ లోటస్’ ను ప్రారంభించారు.

>> దీని ప్రకారం జనతాదళ్‌ ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించారు. దీంతో విపక్ష సభ్యల సంఖ్య తక్కువ కావడంతో భాజపాదే ఆధిక్యం ఉండేది. రాజీనామా చేసిన సభ్యులకు అనంతరం భాజపా సభ్యత్వం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. అనేకమంది ఇలా తిరిగి ఎన్నిక కావడంతో భాజపాకు మెజార్టీకి అవసరమైన సభ్యులు సమకూరారు.

Untitled Document
Advertisements