ఆటోలో సమ౦త.. ఫోటో వైరల్..

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:53 PM

ఆటోలో సమ౦త.. ఫోటో వైరల్..

హైదరాబాద్, మే 16 : హీరోయిన్ సమ౦త.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు సరిగా రావు అనే భావనను సమ౦త బ్రేక్ చేసింది. పాత్రలతో పాటు, కథల విషయంలోనూ అసలే మాత్రం రాజీపడటం లేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.

"రంగస్థలం" లో రామలక్ష్మి గా, "మహానటి" లో మధురవాణి గా ఆమె నటించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అటు తమిళంలోనూ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె తన కన్నడ రీమేక్ మూవీ "యూ టర్న్‌పై" దృష్టి పెట్టింది. పవన్ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో సామ్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది.

ఇందులో వరుస ఆత్మహత్యలను చేధించే జర్నలిస్టుగా కనిపించనుంది. అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సమ౦త ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటో అది. ఇందులో సామ్ నవ్వుతూ కెమెరాకు స్టిల్ ఇచ్చారు.

Untitled Document
Advertisements