యూరప్ లో విక్రమ్, కీర్తి సురేష్ డ్యూయెట్..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 11:34 AM

యూరప్ లో విక్రమ్, కీర్తి సురేష్ డ్యూయెట్..

హైదరాబాద్, మే 21 : చియాన్ విక్రమ్.. హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "సామి స్క్వేర్". విభిన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే విక్రమ్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నా.. గత కొంతకాలంగా ఆయనకు సరైన విజయం లభించలేదు. గతంలో విక్రమ్‌కు మంచి విజయాన్ని అందించిన "సామి" సినిమా.. ఇప్పుడు అదే పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే ఈ సినిమా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోంది.

ప్రస్తుతం 'కారై కుడి'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతున్న ఈ సినిమా.. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. అక్కడ విక్రమ్.. కీర్తి సురేశ్ లపై ఒక డ్యూయెట్ ను చిత్రీకరించనున్నారట. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. తమిళ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమాను జూన్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.





Untitled Document
Advertisements