'గూగుల్ ట్రెండ్స్‌'లో కుమారస్వామి సతీమణి..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 11:37 AM

'గూగుల్ ట్రెండ్స్‌'లో కుమారస్వామి సతీమణి..

బెంగుళూరు, మే 21 : గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికలు, వాటి ఫలితాలు, తర్వాత జరిగిన పరిణామాలు హాట్ టాపిక్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యూహ, ప్రతివ్యుహాలకు ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటక ముఖ్య మంత్రిగా జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ లో ఆయన భార్య రాధిక కుమారస్వామి టాప్ స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా నెటిజన్లు ఈమె కోసం తెగ వెతికేస్తున్నారు. మే 13 నుంచి మే 19 మధ్య కాలంలో.. ‘రాధిక కుమారస్వామి’ అనే పదం గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ స్థానం లో నిలిచింది.

రాధిక కుమారస్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

>> జేడీఎస్‌ నేత హెచ్‌.డి.కుమారస్వామి ఆమెను 2006లో వివాహం చేసుకున్నారు. వీరిరువురికీ ఇది రెండో పరిణయం. వీరికి షర్మిలా కుమారస్వామి అనే కూతురు ఉంది. కుమారస్వామికి 58 ఏళ్లు.. అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. 2005లో రాధికా - కుమారస్వామిలకు పరిచయమైంది. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో అందరికీ వివాహం గురించి తెలిసింది.

>> రాధిక ప్రముఖ నటిగా, నిర్మాతగా కన్నడ ప్రజలకు సుపరిచితమే. 2010లో.. దక్షిణ భారత తార, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య, కుమారస్వామిలకు మధ్య ఓ దశలో ఏర్పడ్డ తగాదాతో.. రాధికకు, కుమారస్వామికి వివాహమైన విషయాన్ని వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి కూడా దాన్ని బహిరంగంగా అంగీకరించారు.

>> తన 16వ ఏట సినీ రంగ ప్రవేశం చేసిన రాధిక శాండల్‌వుడ్‌ను మంచి పేరు తెచ్చుకున్నారు. 2002లో ఆమె నటించిన ‘నీల మేఘ శ్యామ’, ‘నినగాగి’ (నీకోసం), ‘తావరిగె బా తంగీ’ (పుట్టింటికి రా చెల్లి), ’ప్రేమఖైదీ’, 'రోమియో జూలియెట్‌’ చిత్రాలు విడుదలయ్యాయి. 2006 వరకు ఆమె సినిమాల్లో బిజీ అయిపోయారు.

>> ఏడాదికి కనీసం ఐదుకు తగ్గకుండా సినిమాల్లో నటించారు. 2007లో మూడు చిత్రాలు.. ఆ తర్వాతి కాలంలో.. ఏడాదికి ఒక సినిమా చొప్పున.. మొత్తం 30 చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు.

>> టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆమె నటించారు. టాలీవుడ్ లో తారక రత్న హీరోగా వచ్చిన ‘భద్రాది రాముడు’, కోడీ రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అవతారం’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె నిర్మాతగా కొనసాగుతున్నారు.

Untitled Document
Advertisements