అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో ఇలియానా..!!

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 11:49 AM

అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో ఇలియానా..!!

హైదరాబాద్, మే 21 : మాస్ మహారాజ్ రవితేజ.. శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ' (ఏఏఏ). ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ నటించనున్నారు. ప్రధాన పాత్ర కోసం అను ఇమ్మాన్యుయేల్ ను తీసుకోగా మరొక పాత్రకు జోడీగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ను అనుకున్నారు. కాని ఇతర షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా నుండి అను ఇమ్మాన్యుయేల్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో రీ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ ఈ ఛాన్స్ వదులుకోకపోవచ్చని భావిస్తున్నారు. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Untitled Document
Advertisements