నయనతార ను వివాహం చేసుకుంటా.. కుదరకపోతే..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 05:18 PM

నయనతార ను వివాహం చేసుకుంటా.. కుదరకపోతే..

చెన్నై, మే 21 : వైవిధ్యమైన కథలతో, ప్రేక్షకులని అలరిస్తున్న భామ నయన తార నటిస్తున్న చిత్రం 'కోలమావు కోకిల'. యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఇందులో నయనతార ప్రేమ కోసం యోగిబాబు ఆమె వెంట పడుతూ కనిపించారు. ఆమె మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటుంటారు. సరదాగా సాగే ఈ పాటకు విశేషమైన స్పందన లభించింది. 'కోలమావు' అంటే ముగ్గుపిండి.. సినిమాలో 'కోకిల' అంటే నయనతార. మే 16న విడుదల చేసిన పాటను 52 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికీ ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 25వ స్థానంలో ఉంది.

అయితే ఈ పాటను చూసిన పాపులర్‌ నటుడు నట్టి నటరాజ్‌ (నటరాజ సుబ్రమణి) ట్విటర్‌ వేదికగా స్పందించారు. తను కేవలం ‘కోలమావు కోకిల’ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని.. అది కుదరకపోతే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి షేక్‌హ్యాండ్‌ ఇస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు యోగిబాబుకు అభినందనలు చెప్పారు.

నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నట్టి నటరాజ్‌ నటుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా, నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆయన తెలుగులో ‘అ..ఆ’, ‘ఛల్‌ మోహన్‌రంగ’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఎన్టీఆర్‌ 28వ చిత్రం ‘అరవింద సమేత..’ కోసం పనిచేస్తున్నారు.


Untitled Document
Advertisements