వచ్చే నెలలో రానున్న విజయ్ దేవరకొండ..!!

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 06:23 PM

వచ్చే నెలలో రానున్న విజయ్ దేవరకొండ..!!

హైదరాబాద్, మే 21 : విజయ్ దేవరకొండ.. సందీప్ వంగా కాంబినేషన్ లో వచ్చిన "అర్జున్ రెడ్డి" చిత్రం ద్వారా కమర్షియల్ హీరోగా మారాడు. తాజాగా విజయ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో "టాక్సీవాలా" చిత్రంలో నటిస్తున్నాడు. జిఏ2 పిక్చ‌ర్స్, యు.వి.క్రియెష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ఎస్‌కెఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ పై మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18 వ తేదీన విడుదల కావలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయంపై చిత్రయూనిట్ ఒక స్పష్టత ఇవ్వలేదు. తాజాగా జూన్ రెండో వారంలో "టాక్సీవాలా" ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements