నటరత్న Vs మెగాపవర్ స్టార్..!

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 07:57 PM

నటరత్న Vs మెగాపవర్ స్టార్..!

హైదరాబాద్, మే 21 : తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు సంక్రాంతికి కోడి పుంజుల యుద్ధంలా బరిలోకి దిగుతాయి. అందులోనూ మెగా – నంద‌మూరి చిత్రాలు గ‌త రెండు సంక్రాంతులుగా పోటీ పడుతు వస్తూనే ఉన్నాయి. 2017 లో మెగాస్టార్ ఖైది నెం.150 – బాలయ్య గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రంగంలోకి దిగాయి. ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత‌వాసి – బాలకృష్ణ జై సింహా పోటీ ప‌డ్డాయి. ఇప్పుడు 2019లోనూ మెగా – నంద‌మూరి క్లాష్ కు బాక్సాఫీసు వేదిక కాబోతోంది.

2019 సంక్రాంతికి ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ తీసుకురావాల‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఇంకా ఖ‌రారు కాక‌పోయిన‌ప్ప‌టికీ…సంక్రాంతికి ఈ సినిమా రావ‌డం దాదాపుగా ఖాయం అని అంచనా. స‌రిగ్గా సంక్రాంతినే లక్ష్యం చేశాడు చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోందని తెలుస్తోంది.

మెగాపవర్ స్టార్‘ఎవ‌డు’ త‌ర‌వాత సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌లేదు . 'రంగ‌స్థ‌లం' వంటి సాలిడ్ హిట్ తో చెర్రీ ఫుల్ జోష్ లో ఉన్నాడు. పైగా బోయ‌పాటి కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మాస్‌కి కావ‌ల్సిన సినిమాని అందించ‌డంలో బోయ‌పాటి అంది వేసిన చేయి‌. ఈసారి కూడా మాస్ మంత్ర‌మే జ‌పిస్తున్నారు వీరిద్ద‌రూ. ”సంక్రాంతి బ‌రిలో మేమూ ఉన్నామ‌ని..” త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న చేయాల‌ని చిత్ర‌బృందం యోచిస్తోంది. అటు బాల‌య్య‌.. ఇటు చ‌ర‌ణ్‌.. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నారు.

Untitled Document
Advertisements