కాంగ్రెస్ బీజేపీకి కళ్ళెం వేయగలదా..!

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 06:05 PM

కాంగ్రెస్ బీజేపీకి కళ్ళెం వేయగలదా..!

కర్ణాటక, మే 23 : కర్ణాటక 24 వ ముఖ్యమంత్రిగా ఈ రోజు కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఆయనతో గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీతో, బీఎస్పీ చీఫ్ మాయావతి సోనియా గాంధీతో ముచ్చటించుకున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా రెండు జాతీయ పార్టీలే ఎలుతున్నాయని వాటికీ బదులు తృతీయ కూటమి ఏర్పాటు అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో చేరే పార్టీలు ఏవి అని స్పష్టత లేకపోయినా కేసీఆర్ మాత్రం చురుకుగా పావులు కదుపుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్ నిలబడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి.

ఇదిలా ఉంచితే.. దక్షణాదిన బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి.దక్షణాదిన మోదీ, అమిత్ షా మానియా తో ఆ పార్టీ దూసుకుపోతుంది. మరి వారిని నిలువరించాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ కు తప్పనిసరి. కానీ ఆయా పార్టీల నేతలు హస్తం పార్టీ తో చేయి కలుపుతారో లేదో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోదీ ను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీకి తలకు మించిన భారం అనే చెప్పాలి.

>>ప్రాంతీయ పార్టీలు కీలకం..

రాబోవు రోజుల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేయాలి. ప్రాంతీయ పార్టీ లు ఆయా రాష్ట్రాల్లో నెగ్గుకొచ్చిన .. కేంద్రంలో ఎన్డీఏ చక్రం తిప్పుతుంది. ఆ పార్టీ హవాను తగ్గించాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం అనివార్యం.

ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించి దూసుకుపోతున్న మోదీ సర్కారు 'కాంగ్రెస్ ముక్తా భారత్' అంటూ తమ వ్యుహలకు పదును పెడుతుంది. ప్రస్తుతం పంజాబ్, మిజోరం, పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో కూటమిగా ఏర్పడింది. బీజేపీకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఈ ఏడాదిలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికలో రాహుల్ గాంధీ విజయం సాధిస్తే మోదీ హవాకు అడ్డుకట్టవేయవచ్చు.





Untitled Document
Advertisements