కోల్‌కతా ఇన్.. రాజస్థాన్ ఔట్..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 11:13 AM

కోల్‌కతా ఇన్.. రాజస్థాన్ ఔట్..

కోల్‌కతా, మే 24: ఐపీఎల్ లో ఎలిమినేటర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు రాజస్థాన్ విజయం సాధించింది. సొంత గడ్డపై ఆ జట్టు రాజస్థాన్ జట్టు రాయల్స్ పై 25 పరుగుల తేడాతో గెలుపొంది రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందింది. 25న ఇదే వేదికపై జరిగే రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో దినేశ్‌ కార్తీక్‌ సేన తలపడనుంది. తొలుత టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో దినేశ్‌ కార్తీక్‌ (52), ఆండ్రీ రసెల్‌ (49 నాటౌట్‌) మెరవడంతో మొదట కోల్‌కతా 7 వికెట్ల కోల్పోయి 169 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ గెలుపు దిశగా సాగి చివరిలో తడబడి ఐపీఎల్ నుండి వైదొలిగింది. గొప్ప ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ జట్టులో సంజు శాంసన్‌ (50), రహానె (46) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (1/18), పియూష్‌ చావ్లా (2/24), ప్రసిద్ధ్‌ కృష్ణ (1/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డు ఆండ్రీ రసెల్ కు దక్కింది.





Untitled Document
Advertisements