విరాట్ సవాల్ ను స్వీకరించిన ప్రధాని..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 11:38 AM

విరాట్ సవాల్ ను స్వీకరించిన ప్రధాని..

ఢిల్లీ, మే 24 : టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి... ప్రధాని మోదీకి ఫిట్ నెస్ సవాలు విసిరాడు. రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. తాజాగా కోహ్లీ కూడా రాథోడ్‌ సవాలును స్వీకరించి..ఇప్పుడు ఆ ఛాలెంజ్‌ను మోదీకి విసిరాడు. ఈ సవాలును మోదీ కూడా స్వీకరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటానని చెప్పారు. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరిట ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టారు.

క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ మంత్ర పేరుతో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్‌ తాను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ ట్యాగ్‌ చేశాడు. కోహ్లీ సవాలుకు ప్రధాని మోదీ స్పందించారు. 'నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోను పంచుకుంటాను' అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.













Untitled Document
Advertisements