అన్ని తానైన బోనీ కపూర్...

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 04:46 PM

అన్ని తానైన బోనీ కపూర్...

ముంబై, మే 25 : అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణాన్ని అభిమానులు, ఆమె కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణంతో పిల్లల బాధ్యత పూర్తిగా తండ్రి బోనీ కపూర్ పై పడింది. జాన్వీ, ఖుషీలను బోణీ తన మొదటి భార్య పిల్లలకు దగ్గర చేశారు. దీంతో వీరంతా ఒక్కటిగా ఉంటున్నారు.

ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ మాట్లాడుతూ.. "గడిచిన ఈ మూడు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి. శ్రీదేవి లేదన్న వార్త ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా. మా జీవితాల్లో ఒక్కసారిగా పనులన్ని ఆగిపోయినట్లు అనిపించింది. శ్రీదేవి ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. తను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. శ్రీదేవి నాకు ఓ స్నేహితురాలు, నా ప్రాణం, నా పిల్లలకు తల్లి. నా ఇద్దరు కూతుళ్లకు వారి అమ్మే ప్రపంచం. కానీ ఇప్పుడు నేను వారికి తండ్రి గానే కాదు తల్లిగానూ వ్యవహరిస్తూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Untitled Document
Advertisements