అనుపమ కు తల్లిగా ఆమని..!!

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 06:03 PM

అనుపమ కు తల్లిగా ఆమని..!!

హైదరాబాద్, మే 25 : 'మావి చిగురు', 'శుభలగ్నం' సినిమా పేర్లు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు కథానాయిక ఆమని. ఆ చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇటీవల ఆమని "భరత్ అం నేను" చిత్రంలో మహేష్ బాబుకు తల్లిగా నటించారు. కొడుకును ఉన్నత లక్ష్యం వైపుకు నడిపించే తల్లిగా నటించి మెప్పించారు. దీంతో ఆమనికి అవకాశాలు వరుసకట్టాయి.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ కి తల్లిగా నటించడానికి ఆమె ఓకే చెప్పేసినట్టుగా సమాచారం. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కను౦ది. ఇటీవలే ఈ సినిమాకి 'హలో గురు ప్రేమకోసమే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వన్ తల్లి పాత్రకి ప్రాముఖ్యత ఉండటంతో ఆమనిని తీసుకున్నారట. ఆమె భర్త పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు.

Untitled Document
Advertisements