హ్యాట్రిక్ పై గురిపెట్టిన బోయపాటి-బాలయ్య..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 02:15 PM

హ్యాట్రిక్ పై గురిపెట్టిన బోయపాటి-బాలయ్య..

హైదరాబాద్, మే 26 : 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎంతో హిట్ వేరే చెప్పకర్లేదు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించాయి. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ బయోపిక్ ను ప్రారంభించిన బాలయ్య.. చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టారు. ఈ విరామంలో వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. బోయపాటి, బాలయ్యల కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్‌.బి.కె ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బోయపాటి ఈ సినిమాను 2019 ఎన్నికలకు ముందు.. విడుదల చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది.





Untitled Document
Advertisements