భావోద్వేగానికి లోనైన సనీలియోన్...

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 04:41 PM

భావోద్వేగానికి లోనైన సనీలియోన్...

హైదరాబాద్, మే 26 : సన్నీలియోన్.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తి౦పును సంపాదించుకుంది. పలు ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హాట్ భామ.. దక్షిణాదిలో "వీరమహాదేవి" అనే సినిమాలో టైటిల్‌ రోల్‌ కూడా పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి ప్రచార చిత్రం అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సన్నీలియోన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ "కరణ్‌ జిత్‌ కౌర్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోని". ఈ డాక్యుమెంటరీలో ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనలు.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నారట. తాజాగా తన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనను సన్నీ వీక్షించి౦దట. ఈ షో చూస్తున్నంతసేపు ఆమె భావోద్వేగానికి గురయ్యారట.

ఈ మేరకు తన ట్విట్టర్ లో.. "ఈ షో చూస్తున్నంతసేపు కన్నీరు ఆగలేదు. నా హృదయం వేలసార్లు ముక్కలైంది. బ్లూఫిలిమ్స్ చేయడానికి ముందు ఎలా ఉన్నానో అలా కావాలనుంది. కాని ఆరోజు మళ్ళీ ఎప్పటికీ రాదు. తప్పు చేశానన్న భావన కలుగుతోంది" అంటూ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేసింది.Untitled Document
Advertisements