'నిఫా' లేదు.. నిశ్చి౦తగా ఉండండి..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 06:43 PM

'నిఫా' లేదు.. నిశ్చి౦తగా ఉండండి..

హైదరాబాద్, మే 26 : గత కొన్ని రోజులుగా కేరళను వణికిస్తున్న ప్రమాదకర నిఫా వైరస్‌ హైదరాబాద్‌ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మేరకు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి.. రాష్ట్రంలో నిఫా వైర‌స్ లేదని, ప్రజ‌లు భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని స్పష్టం చేశాడు. అనుమాన౦ ఉన్న ఇద్దరు వ్యక్తుల శాంపిల్స్‌ పుణేకు పంపామన్నారు. కానీ ఆ ఇద్దరి బ్లడ్‌ శాంపుల్స్‌లో వైరస్‌ లేదని రుజువైందని వివరించారు.

ఒకరు టైఫాయిడ్ తో, మరొకరు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని.. అంతేగాని వారికి నిఫా వైరస్ సోకలేదని వెల్లడించారు. కాని ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించకపోవడమే మంచిదని హెచ్చరించారు. ఒకవేళ ఈ వైరస్‌ సోకినట్లుగా అనుమానం ఉంటే బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చి టెస్టులు చేయించుకోవాలన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు చెబుతోంది. కాగా కేరళలో ఇప్పటికే నిఫా వైరస్ సోకి 12 మరణాలు సంభవించగా, పలు కేసులు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements