వైరల్ : ఆశ్చర్యానికి గురిచేసిన ప్రధాని..

     Written by : smtv Desk | Wed, Jun 06, 2018, 12:29 PM

వైరల్ : ఆశ్చర్యానికి గురిచేసిన ప్రధాని..

ఎడిన్‌బర్గ్‌‌, జూన్ 6 : ఆయనో ప్రధాని.. ఆయన కింది స్థాయిలో ఎంతోమంది పని చేస్తుంటారు. కావాలంటే ఆయన ఒక్క సైగతో తనకు కావలసిన వాటిని సమకూర్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తే. కాని ఈ ఘటన చూస్తే ఆయన నిరాడంబరత ఎంతో అర్థమవుతుంది. పార్లమెంట్ లో ఆయన చేసిన పనికి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు ఆశ్చర్యంతో పాటు.. నెటిజన్ల నుండి ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్టే ఓ చేతిలో ఫైళ్లతో.. మరో చేతిలో కాఫీ కప్పుతో పార్లమెంట్‌లోకి వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో సెక్యూరిటీ వద్ద ఉన్న మెషీన్‌ తగిలి ఆ కప్పు ఒలికిపోయింది. ఆ స్థానంలో ఎకేవరైనా ఉండుంటే పని వారితో చెప్పి శుభ్రం చేయించేవారు. కాని రుట్టే మాత్రం మహిళా సిబ్బంది చేతిలోని తుడిచే కర్రను లాక్కుని సరదాగా ఆయనే శుభ్రం చేశారు. పక్కనే ఉన్న స్టాఫ్‌ ఆయనను నిలువరించే యత్నం చేసినప్పటికీ ఆయన వారి మాట వినలేదు. తాను చేసిన పొరపాటుకు.. తాను శుభ్రం చేయటం సరైందని వారితో చెప్పటం విశేషం. దీంతో వారంతా ఆయన చుట్టూ చేరి పాట పాడుతూ ఆయన్ని ప్రొత్సహించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైకులు, షేర్ లు, కామెంట్లతో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.Untitled Document
Advertisements